Thursday, August 16, 2018

How To Verify Our Blog In Google Webmaster Tool - గూగల్ వెబ్ మాస్టర్ టూల్-బ్లాగ్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు

How To Verify Our Blog In Google Webmaster Tool - గూగల్ వెబ్ మాస్టర్ టూల్-బ్లాగ్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు 

హాయ్ నా ప్రియ సహోదరులారా , మిత్రులారా  ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ చాలా విలువైనది .ఈ సమాచారం కూలంఖుసంగా నేర్చుకొని మన తోటి మిత్రులకు తెలియచేస్తారని కోరుకుంటున్నాను .ఇక మన బ్లాగ్ ను లేదా వెబ్సైటు ను ఎందుకు వెరిఫికేషన్ చేస్తారు , ఎలా చేస్తారు అలా చేయడం వలన ఏం జరుగుతుంది తెలుసుకుందాం .ముందుగా మన బ్లాగ్ లేదా వెబ్సైటు గూగుల్(Google ) , బింగ్(Bing) లేదా యాహు (Yahoo)  (ఇవి మనకు ముక్యం గా తెలిసినవి ) లలో వెరిఫై చేస్తే మన బ్లాగ్ అంతర్జాలం లో వెతికిన వెంటనే కనిపిస్తుంది , అలా కనిపించడం వలన మన బ్లాగ్ కి ఎక్కువ మంది visitors వస్తారు . visitors ఎక్కువగా వస్తే మనీ ఎక్కువగా సంపాదించవచ్చు .
మనం ముక్యంగా తెలుసుకోవలసింది సెర్చ్ ఇంజిన్ అంటే ఏమిటి , ఎన్నిరకాలు సెర్చ్ ఇంజిన్ లు ఇంటర్నెట్ లో   వున్నాయి  అనే విషయాలు కింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోండి . 

What Is Search Engine ?-సెర్చ్ ఇంజిన్ అంటే ఏమిటి? : click here

How To Add Blog or Website To Google Analytics? - గూగుల్ అనలిటిక్స్ కు మన వెబ్సైటు ను ఎలా జోడిస్తారు : click here
Google Web Master Tools - గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ : సింపుల్ గ అర్థం అయ్యేలా చెప్తాను. మన బ్లాగ్ లేదా వెబ్సైటు ఓనర్ షిప్ ను గూగుల్ లో రిజిస్టర్ చేసుకోవటానికి ఈ టూల్ ను ఉపయోగిస్తారు అంటే ఈ బ్లాగ్ మనదే అని గూగుల్  లో రిజిస్టర్ చేసుకోవటం అనిమాట .
ఇలా చేయటం వలన మన బ్లాగ్ లేదా వెబ్సైటు ఇంటర్నెట్ లో కనిపిస్తుంది లేకపోతే గూగుల్ లో కనిపించదు .  ఇప్పుడు ఎలా వెరిఫై చేయాలో చూద్దాం .
 మొదట మన బ్లాగ్ లేదా వెబ్సైటు కంట్రోల్ పానెల్ ఓపెన్ చేసి లేదా డైరెక్ట్ గ గూగుల్ సెర్చ్ కన్సోల్ అని గూగుల్ లో టైపు చేసి మన బ్లాగ్ లేదా వెబ్సైటు ను జోడిస్తారు . ముందుగా బ్లాగ్ కంట్రోల్ పానెల్ ఓపెన్ చేసి సెట్టింగ్ లు (settings) ను క్లిక్ చేసి సెర్చ్ ప్రిపరన్సు (search preferences) nu క్లిక్ చేస్తే గూగుల్ సెర్చ్ కన్సోల్ (google search console) ఫై క్లిక్ చేస్తే డైరెక్ట్ గ కొత్త  పేజి లో మన బ్లాగ్ ను జోడించామని (ADD PROPERTY) వస్తుంది .
How To Verify Our Blog In Google Webmaster Tool - గూగల్ వెబ్ మాస్టర్ టూల్-బ్లాగ్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు

 సెర్చ్ ప్రేఫెరాన్సుస్ (Search Preferences ) ఫై క్లిక్ చేస్తే క్రింద ఇచ్చిన ఇమేజ్ లో లాగా వస్తుంది అక్కడ ADD A PROPERTY అని వుంటుంది. దానిపై క్లిక్ చేస్తే మే బ్లాగ్ లేదా వెబ్సైటు  జోడించి వెరిఫై చేసుకోమని చెప్తుంది .
CLICK ADD A PROPERTY AND ADD YOUR WEBSITE



ADD A PROPERTY ఫై క్లిక్ చేసి అక్కడ వెబ్సైటు లేదా మొబైల్ యాప్ ఆడ్ చేయమని అడుగుతుంది అక్కడ మన బ్లాగ్ లేదా వెబ్సైటు లేదా మొబైల్ యాప్ అడ్రస్ జోడిస్తే డైరెక్ట్ గ వెరిఫై అయిపోతుంది మన బ్లాగ్  .ఎందుకంటే మనం బ్లాగ్ కంట్రోల్ పానెల్  నుంచి  మన బ్లాగ్ ని సెర్చ్ కన్సోల్ కి  జోడిన్చాము. ఇంకొక పద్దతిలో డైరెక్ట్ గ గూగుల్ సెర్చ్ కన్సోల్ ను ఓపెన్ చేసి అక్కడ ఆడ్ చేస్తే అప్పుడు ఒక html కోడ్ వస్తుంది  ఆ పద్ధతి కూడా చూద్దాం.

మరొక పద్దతిలో ఓపెన్ గూగుల్  సెర్చ్ మరియు వెబ్ మాస్టర్ టూల్స్(GOOGLE WEBMASTER TOOLS)  అని  లేదా సెర్చ్ కన్సోల్ (SEARCH CONSOLE) అని కానీ టైపు చేసి ఓపెన్ చేయండి .
ఆ లింక్ క్లిక్ చేసిన తరువాత ADD A PROPERTY అని వస్తుంది , మన వెబ్ సైట్ ను లేదా బ్లాగ్ ను ఆడ్ చేసిన కింద ఇచ్చిన ఇమేజ్ లో ల వెరిఫై అని వస్తుంది . అక్కడ మనం చాల రకాలు గ వెరిఫై చేసుకోవచ్చు . కానీ సులువుగా html కోడ్ ని మన వెబ్  సైట్ లేదా బ్లాగ్  థీమ్స్ html కోడ్ ఓపెన్ చేసి అక్కడ ఈ html కోడ్  ను పేస్టు చేసి సేవ్ చేసి ,  వెరిఫై చేస్తే క్రింది విధం గా వస్తుంది .
ఇప్పుడు ఇక్కడ మన బ్లాగ్ వెరిఫై చేసుకోవడానికి మనకి రెండు పద్దతులు ఉంటాయి , అవి 1. Recommended method మరియు 2. Alternate method (ఆల్టర్నేట్ మెథడ్) , ఇక్కడ మనం రెండో పద్ధతి ఉపయోగించుకుంటే ఈజీ గ వెరిఫై చేసుకోవచ్చు . ఆల్టర్నేట్ పద్ధతి ఫై క్లిక్ చేసి html Tag క్లిక్ చేస్తే అక్కడ ఒక html కోడ్ ఇస్తారు , ఆ కోడ్ ను కాపీ చేసి మన బ్లాగ్ థీమ్ కోడింగ్ పార్ట్ HEDDER ట్యాగ్ క్రింది బాగం లో జోడించి సేవ్ చేసి అప్పుడు వెరిఫై చేయాలి .

  ఆల్టర్నేట్ పద్దతి ఫై క్లిక్ చేసి html ట్యాగ్ క్లిక్ చేసి html కోడ్ ను కాపీ చేసి క్రింద ఇచ్చిన ఇమేజ్ లో లా సేవ్ చేయండి.
ఆ html కోడ్ ను కాపీ చేసి మరల ,మనా బ్లాగ్ కంట్రోల్  పానెల్ ఓపెన్ చేసి థీమ్స్ క్లిక్ చేసి ఎడిట్ html (edit html) ఫై క్లిక్ చేస్తే అక్కడ ఒక html బోర్డు కోడింగ్ తో వస్తుంది , అక్కడ హెడర్ లో ఆ html కోడ్ ను జోడించి సేవ్ చేయాలి.తరువాత మల్లి గూగుల్ సెర్చ్ కన్సోల్ పేజి కి వెళ్లి వెరిఫై క్లిక్ చేయాలి .
ఫైనల్ 2 స్టెప్స్ ఎడిట్ html క్లిక్ చేసి మనం అంతకుముందు కాపీ చేసిన html కోడ్ ను హెడర్ లో క్రింద ఇచిన ఇమేజ్ లో ల సేవ్ చేసి వెరిఫై చేయాలి .
ఇక్కడ సేవ్ థీమ్ సేవ్ చేసినతరువాత మరల ముందు ఇమేజ్ లో వున్న వెరిఫై బటన్ క్లిక్( మీరు ఎక్కడ కోడ్ కాపీ చేసారో అక్కడ కింద వెరిఫై అని వుంటుంది ) చేయాలి  .
అప్పుడు పైన చూపిన ఇమేజ్ లో Congratulations you have successfully verified your ownership . అని వస్తుంది . ఇక్కడితో ఒక ముక్యమైన పని అయింది . అలా వెరిఫై చేసిన 24 గంటలకి మన బ్లాగ్ లేదా వెబ్సైటు గూగుల్ లో కనబడుతుంది.

How To Add Site Map(XML) To Google? - site map ను గూగుల్ లో ఎలా ఆడ్ చేస్తారు ? click here

No comments:

Post a Comment

High-Paying Remote Jobs: Opportunities for Earning from Home

High-Paying Remote Jobs: Opportunities for Earning from Home In today's digital age, remote work has become increasingly popular, offeri...