Tuesday, July 9, 2024

What is blogging? -బ్లాగింగ్ అంటే ఏమిటి ?


బ్లాగింగ్ అంటే ఏమిటి ?
what is blogging, difference between blog and website

మనకు తెలిసిన సమాచారాన్ని(ఎడ్యుకేషన్,ఎంటర్టైన్మెంట్ , సాఫ్ట్వేర్ ,etc ) ఆన్లైన్ లో పబ్లిక్ గా పంచుకోవడాన్నే బ్లాగింగ్ అంటారు .అంటే మనకు ఏ రంగం లో స్కిల్ వుందో దాన్ని ఎంచుకొని ఆ సమాచారాన్ని పోస్ట్స్ , పేజెస్ రూపంలో కంటెంట్ రాయడాన్ని బ్లాగింగ్ అంటారు . ఈ కంటెంట్ రాసేవాళ్ళను బ్లాగర్స్ అంటారు . ఈ బ్లాగింగ్ అనేది చాల ఏళ్ల క్రితం నుండి వున్నా మన దేశం లో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది.
           ఇతర దేశాల్లో ఇలా సమాచారాన్ని పోస్ట్ చేస్తూ లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు ఎప్పటినుంచో , మనదేశంలో కూడా కొంతమంది లక్షల్లో సంపాదిన్చేవాళ్ళు వాళ్ళు వున్నారు . ఈ బ్లాగ్గింగ్ ను వృత్తి గ చేసుకొని సాఫ్ట్వేర్ జాబ్స్ ను కూడా వదిలేసి సొంతంగా బ్లాగింగ్స్ చేసి డబ్బు సంపాదిస్తున్నారు . కొంతమంది పార్ట్ టైం గా కూడా సంపాదిస్తున్నారు . ఈ బ్లాగింగ్ లో ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఈ బ్లాగ్ ను క్రియేట్ చేసుకోవడానికి గూగుల్ కంపెనీ , ఇంకా కొన్ని కంపెనీస్  ఫ్రీ సబ్ డొమైన్ (your website name.blogspot.com, .wordpress.com, .wix.com, etc ) తో బ్లాగ్ ను క్రియేట్ చేసుకోవడానికి అవకాసం ఇచ్చాయి.
 బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలి click here
            అసలు వెబ్సైటు అంటారు కదా.. ఈ వెబ్సైటు కు బ్లాగ్ కు వున్నా తేడా ఏమిటి ? అసలు బ్లాగ్ ను క్రియేట్
చేయడానికి ఏమైనా కోడింగ్ స్కిల్ల్స్ అవసరమా ? బ్లాగ్గింగ్ లో ఎలాంటి కంటెంట్ రాయాలి? అనే విషయమ్ ఫై  అవగాహన చాల అవసరం . ఈ బ్లాగింగ్ చేయటానికి ఏ కోడింగ్ అవసరం లేదు , ఈజీ గ బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు .
బ్లాగ్ కి వెబ్సైటు కు వున్న తేడా ఏమిటి ?
బ్లాగ్ అనేది వెబ్సైటు లో ఒక బాగం . బ్లాగ్ లో మనం రాసే పోస్ట్స్  మొదటి పేజి లో తేదీ లను ఆధారం గ చేసుకొని ( లేటెస్ట్ పోస్ట్ లు ముందు వరుసలో ఉంటాయి) డిస్ప్లే అవుతాయి. ఈ బ్లాగ్ మొత్తం వ్యవస్థ టెంప్లేట్ ఫై ఆధారపడి వుంటుంది . దీనిగురించి తరువాత తెలుసుకుందాం.
ఫ్రీ బ్లాగ్ క్రియేట్ చేసుకోవటానికి కొన్ని వెబ్సైటు లు :
1.google.com(blogger.com or blogspot.com)
2.wix.com
3.simplesite.com
4.wordpress.org
5.squarespace.com
6.medium.com
7.weebly.com
8.ghost.org
9.penzu.com
10.svbtle.com
11.webs.comtumblr.com
ఈ బ్లాగింగ్ కు ఎక్కువగా బ్లాగ్ స్పాట్ , వీబ్లీ , విక్ష్ , వర్డుప్రెస్సు ను ఎక్కువగా ఉపయోగిస్తారు .
వెబ్సైటు:
వెబ్సైటు లు అనేవి 3 రకాలు .
1.పబ్లిక్ వెబ్ సైట్స్ (బ్లాగ్స్ తో కలిపి)
2.ప్రైవేటు వెబ్ సైట్ లు
3. ఇతర వెబ్ సైట్స్
పబ్లిక్ వెబ్ సైట్స్:
                 పబ్లిక్ వెబ్ సైట్స్ అంటే అందరు మొత్తం సమాచారాన్ని  చూడగలిగితే అలంటి వెబ్సైటు లను పబ్లిక్ వెబ్సైటు లు అంటారు. ఉదాహరణకు ఎంటర్టైన్మెంట్ , ఎడ్యుకేషనల్ , ఈ కామర్స్ , మార్కెటింగ్ అఫిలియేట్ . ఇంకా ఇలాంటివి ఉదాహరణకు చాలానే వున్నాయి.
ప్రైవేటు వెబ్ సైట్ లు:
               ఈ వెబ్సైటు లు పెద్ద పెద్ద కంపెనీస్ లో వర్క్ పర్పస్ కొరకు సొంతంగా ప్రోఫెసనల్స్ తో డిజైన్ చేయిస్తారు. ఈ వెబ్సైటు లు కేవలం ఆ కంపెనీ కి సంబందించిన వ్యక్తులు మాత్రమే ఉపయోగించడానికి వీలుగా తయారు చేస్తారు .


No comments:

Post a Comment

High-Paying Remote Jobs: Opportunities for Earning from Home

High-Paying Remote Jobs: Opportunities for Earning from Home In today's digital age, remote work has become increasingly popular, offeri...